హార్ట్‌ఫెయిల్యూర్ అంటే ఏమిటి?
గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేయడం గుండె యొక్క పని. శరీరంలో అవయవాలన్నింటికీ సరిపడేంత రక్తం సరఫరా చెయ్యలేకపోతే దాన్ని హార్ట్ఫెయిల్యూర్ అంటారు. దీన్నే గుండె కండరాల వైఫల్యం అని కూడా అంటారు. అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. తద్వారా హార్ట్ఫెయిల్యూర్ వస్తుంది. అందువల్ల నీరు, ఇంకా ఇతర ద్రవాలు ఊపిరితిత్తుల్లో, కడుపు లో, కాలేయంలో, మరియు కాలు భాగంలో పేరుకుంటాయి.
హార్ట్ఫెయిల్యూర్ కి ప్రధాన కారణాలు?
అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనవి.
1. అధికరక్తపోటు (హైబీపీ)
2. కరోనరీ దమని వ్యాధి – కొవ్వువలన కరోనరీ ధమనులు ఇరుకుగా మారుతాయి , గుండె యొక్క కండరానికి రక్త ప్రవాహం తగ్గుతుంది.
3. గుండెపోటు
4. మధుమేహం లేదా చక్కెర వ్యాధి
5. మద్యపానం
6. స్థూలకాయం
7. వాల్వ్‌లార్ డిసీజ్
8. వైరల్ ఇన్ఫెక్షన్లు
9. పోషకాహార లోపం
10. హెచ్ఐవీ
11. ప్రెగ్నెన్సీ
12. జన్యు లోపం
13. కీమో–రేడియేషన్ (క్యాన్సర్ చికిత్సల్లో)
హార్ట్ఫెయిల్యూర్ లక్షణాలు
1. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం/ శ్వాస ఆడకపోవడం/ ఆయాసం
2. వేగంగా శ్వాస తీసుకోవడం
3. దగ్గు
4. ఛాతీ నొప్పి
5. అలసట /నీరసం
6. కాళ్లవాపు, పాదాల వాపు
7. బరువు పెరగడం
8. పొట్టఉబ్బడం
హార్ట్ఫెయిల్యూర్ నిర్ధారణ పరీక్షలు
1. ఈసీజీ పరీక్ష
2. 2–డి ఎకో కార్టియోగ్రఫీ పరీక్ష
3. రక్తపరీక్షలు
2–డి ఎకో కార్టియోగ్రఫీ పరీక్ష ద్వారా గుండెపనితీరు, గుండె కవాటాల పనితీరు, గుండెలోని ఒత్తిడిని అధ్యయనం చేయవచ్చు.
హార్ట్ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవడం ఎలా ?
1. అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవాలి- అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచడం ద్వారా రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు.
2. మధుమేహంను అదుపులో ఉంచుకోవాలి.
3. స్థూలకాయాన్నినివారించుకొనిఎత్తుకుతగినబరువుఉండేలాచూసుకోవాలి
4. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 30 – 35 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవాలి.
5. ఆరోగ్యకరంగా ఆహారం తీసుకనే విధానాన్ని అనుసరించడం. తాజా పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ ,
లో–ఫ్యాట్ డైరీ , మరియు ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవాలి. సాల్ట్, షుగర్, మరియు రిఫైండ్ గ్రెయిన్స్ ని వీలున్నంత తక్కువగా తీసుకోవాలి.
6. పొగతాగడం వల్ల గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. ధూమపానం మానేయడం. సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా మంచిది కాదు.
7. మద్యం కూడా గుండెను దెబ్బతీస్తుంది. మద్యం వెంటనే ఆపేయాలి.
8. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
9. గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరిం
చుకోవాలి. దానివల్ల తక్షణ రక్షణతో పాటు మున్ముందు గుండెకు నష్టం జరగకుండా చూసుకోడానికి, దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఏర్పడకుండా చూసుకోడానికి
ఉపయోగపడుతుంది.
10. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి.
11. రక్తంలో ఎక్కువగా కొలస్ట్రాల్ ఉంటే దానివల్ల కరొనరీ దమనల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందువల్ల గుండె యొక్క కండరానికి రక్త ప్రవాహం తగ్గుతుంది .
అందుకే రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా మరియు మందుల ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
12. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. తద్వారా హార్ట్‌ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు.