హార్ట్ ఫెయిల్యూర్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనికి జీవితకాల చికిత్స అవసరం. చికిత్సలో మందులు మాత్రమే కాకుండా ఆహారం మరియు జీవనశైలిలో కూడా మార్పులు చెయ్యాలి.
శరీర బరువును తరచుగా కొలవడం
శరీర బరువును తరచుగా కొలవడం శరీరంలో నీరు చేరడం తొందరగ గుర్తించవచ్చు. శరీర బరువు పెరగడం గుండె పరిస్థితి క్షీణించటానికి సంకేతం మరియు సమీప భవిష్యత్తులో ఆసుపత్రి admission అవ్వడానికి కి హెచ్చరిక. తరచుగా బరువును కొలవడం ద్వారా నీరు చేరడం ముందుగా గుర్తించి మందుల మోతాదును మార్చ వచ్చు. ఒక రోజులో బరువు 1 కిలోగ్రాము పెరిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒక వారంలో బరువు 2 కిలోగ్రాము పెరిగితే కూడా, అత్యవసరంగా గుండె వైద్యుడిని సంప్రదించండి.
తక్కువ ఉప్పు తీసుకోవడం తప్పనిసరి
ఆహారంలో అధిక ఉప్పు తీసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రోగుల శరీరంలో అదనపు నీరు పేరుకుపోవడం జరుగుతుంది . ఆహారంలో అధిక ఉప్పు తీసుకోవడం శరీరం నుండి నీటిని సమర్థవంతంగా తొలగించడాన్ని నిరోధిస్తుంది. ఆహారంలో అధిక ఉప్పు తీసుకోవడం హార్ట్ మందుల సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు (BP) కూడా పెరుగుతుంది. రక్తపోటు (BP) పెరుగుదల వల్ల గుండె కష్టపడి పనిచేయ్యాల్సివస్తుంది మరియు హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి వేగంగా అభివృద్ధి చెందుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ రోగులలో తరచుగా ఆసుపత్రి admissions అవ్వడానికి అధిక ఉప్పును తీసుకోవడం ఒక ప్రధాన కారణం. ఆహారంలో తక్కువ ఉప్పు తీసుకోవడం శరీరంలో నీరు అధికంగా చేరడం నిరోధిస్తుంది, ఆసుపత్రి admissions అవ్వడాన్నితగ్గిస్తుంది మరియు వ్యాధి యొక్క పురోగతిని ఆలస్యం చేస్తుంది.
తక్కువ నీటిని తీసుకోవడం
తేలికపాటి గుండె వైఫల్యం ఉన్న రోగులు తగినంత నీరు త్రాగవచ్చు. కానీ తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న రోగులు నీరు ఎక్కువగా తీసుకోకండి. తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న రోగులు త్రాగె అదనపు నీటిని వారి శరీరం మరియు ఊపిరితిత్తులలో నిలుపుకుంటారు.
తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న రోగులు తరచుగా ఊపిరి ఆడకపోవడం మరియు కాలు వాపు సమస్యలతో బాధపడతారు. ఈ రోగులు
ఎక్కువ నీటి వినియోగం వల్ల ఊపిరి ఆడకపోవడం మరియు కాళ్ళ వాపు సమస్యలను మరింత పెంచుకుంటారు. ఈ రోగులు రోజుకు 2 లీటర్ల కంటే తక్కువ ద్రవం తాగడం మంచిది.
శరీర బరువును అదుపులో ఉంచడం తప్పనిసరి
ఊబకాయం మరియు అధిక బరువు ఉన్న రోగులలో, ఆరోగ్యకరమైన గుండె కూడా శరీరానికి మద్దతు ఇవ్వడానికి చాలా కష్ట పడాల్సి ఉంటుంది. సాధారణ గుండె అలా కష్టపడగలదు కానీ గుండె వైఫల్యంలో బలహీనమైన గుండె అలా కష్టపడలేదు. బలహీనమైన గుండెను అలా కష్టపెట్టడం వలన అది మరింత బలహీనంగా మారుతుంది. బరువును అదుపులో ఉంచడం వల్ల బలహీనమైన గుండె తన పనిని సులభంగా చేయగలుగుతుంది.
ధూమపానం మానేయడం తప్పనిసరి
సిగరెట్ ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది మరియు మీ ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. సిగరెట్ ధూమపానం గుండెకు సరఫరా చేసే నాళాలు కొలెస్ట్రాల్తో మూసుకుపోయేటట్టు చేస్తుంది. సిగరెట్ ధూమపానం గుండెపోటు రావడానికి కూడా దారితీస్తుంది. గుండెపోటు బలహీనమైన గుండెను మరింత బలహీనపరుస్తుంది.
ఆల్కహాల్ తీసుకోవడం ఆపండి
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం మాత్రమే కాదు, గుండె కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలం పాటు మద్యం సేవించడం వల్ల కొంతమందిలో గుండె బలహీనపడవచ్చు. దీన్ని ఆల్కహాల్ ప్రేరిత కార్డియోమయోపతి అంటారు. అలాంటి వ్యక్తులు వెంటనే మద్యం తీసుకోవడం మానేయాలి. ఆల్కహాల్ కాకుండా ఇతర కారణాల వల్ల గుండె బలహీనమైన ఇతర రోగులకు, ఆల్కహాల్ ఆపడం మంచిది. అతిగా మద్యం తీసుకోవడం అరిథ్మియా (ARRYTHMIA) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
రెగ్యులర్ వ్యాయామం
మీ శరీరం అనుమతించినట్లయితే, వారానికి కనీసం 5 రోజులు రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం రక్తపోటు (BP), రక్తంలో చక్కెర మరియు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె రోగులు వ్యాయామం చేసేటప్పుడు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వారి పరిమితికి మించి చేయకూడదు. నడక మరియు సరళమైన stretches హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు సురక్షితమైన మరియు ఉత్తమమైన వ్యాయామాలు.
1xbet – Best Bet in 1xBet – Download or Install for Android
1xbet is 1xbet 먹튀 the best betting app in the world created for esports. It is a one of the safest and most goyangfc trusted names among players. It offers a user friendly deccasino interface 도레미시디 출장샵