రక్తకణాల్లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్ అని ప్రధానంగా మూడు రకాల కణాలు
ఉంటాయి.రక్తం గడ్డకట్టడం మరియు గాయం నయం చేయడంలో కీలక పాత్ర పోషించే ఒక రకమైన రక్త కణాలనే ప్లేట్‌లెట్స్ అంటారు.సాధారణ ప్లేట్‌లెట్ కౌంట్ ఒక మైక్రోలీటర్ రక్తంలో 150,000 నుండి 450,000 ప్లేట్‌లెట్ల వరకు ఉంటుంది.ఒక వ్యక్తి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య మైక్రోలీటర్‌కు 150,000 కంటే తక్కువగా ఉంటే, దానిని లెస్ ప్లేట్‌లెట్ కౌంట్ (థ్రోంబోసైటోపెనియా) అంటారు. సాధారణంగా డెంగీ, మలేరియా,ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి.తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ అధిక రక్తస్రావంకు దారితీస్తుంది. తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ ఉంటే తరచుగా ముక్కు నుండి రక్తం కారడం, దెబ్బ తగిలిన తరువాత ఎక్కువ సేపు రక్తస్రావం కావడం జరగవచ్చు . చర్మ కింద ఎర్రటి మచ్చలు కూడా వస్తాయి .చిగుళ్ళలో రక్తం కారడం, మూత్రంలో రక్తం, మలంలో రక్తం పడడం సంభవించవచ్చు .శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుకోవాలంటే మందులతో పాటు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం
ప్లేట్‌లెట్ స్థాయిలను పెంచడంలో సహాయపడే ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము
బొప్పాయి పండు మరియు బొప్పాయి ఆకు సారం
బొప్పాయి ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్‌లెట్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆకు రుచి మాత్రం కాస్తా చేదుగానే ఉంటుంది. బొప్పాయి ఆకు ని రసం లాగా తీసుకోండి. బొప్పాయి పండు కూడా ప్లేట్‌లెట్ పెరుగుదలకు మంచిదే.
గోధుమ గడ్డి
తరచుగా రసం లాగా తీసుకుంటే, గోధుమ గడ్డి దాని అధిక క్లోరోఫిల్ కంటెంట్ కారణంగా ఎర్ర రక్త కణాలను మరియు ప్లేట్‌లెట్ గణనలను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ గడ్డిని రసంగా చేసుకుని అందులో కాస్తా నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ
యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్న దానిమ్మ ప్లేట్‌లెట్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది.
విటమిన్ బీ12 అధికంగా ఉండే ఆహారాలు
విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకం. ప్లేట్‌లెట్ ఉత్పత్తికి పరోక్షంగా మద్దతు ఇస్తుంది.
విటమిన్ B12 మాంసం, చేపలు, గుడ్లు మరియు ఫార్టిఫైడ్ పాల వంటి జంతు ఉత్పత్తులలో లభిస్తుంది
ఫోలేట్ (విటమిన్ B9) అధికంగా ఉండే ఆహారాలు
ప్లేట్‌లెట్‌లతో సహా కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఈ విటమిన్ అవసరం . ఫోలేట్ అధికంగా ఆకు కూరలు, చిక్కుళ్ళలో లభిస్తుంది
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు
విటమిన్ సి మొక్కల ఆధారిత మూలాల నుండి ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది . రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది . ఈ విటమిన్ సిట్రస్ పండ్లు లో లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, ఉసిరి, తినడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ఫ్రీ రాడికల్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహారపదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని డైట్‌లో చేర్చుకోవచ్చు.
విటమిన్ కె ఫుడ్ అధికంగా ఉండే ఆహారాలు
విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్‌లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. విటమిన్ కె ఉండే గుడ్లు, లివర్, మాంసం లాంటి ఫుడ్స్ తినడం వల్ల కూడా ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. బ్రోకలీ, క్యాబేజీ యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ కె కలిగి, ఆరోగ్యకరమైన ప్లేట్‌లెట్ స్థాయిలను ప్రోత్సహిస్థాయి . బచ్చలికూర మరియు కాలే వంటి ఆకు కూరలలో విటమిన్ K సమృద్ధిగా ఉండడం వల్ల ప్లేట్‌లెట్ ఉత్పత్తి మరియు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి . విటమిన్ ఎ, సి , బి-కాంప్లెక్స్, ఐరన్ అధికంగా ఉండే బీట్‌రూట్ శరీరం యొక్క హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మరియు ప్లేట్‌లెట్స్ ఉత్పత్తిలో సహాయపడటానికి ప్రసిద్ధి చెందింది. ఈ బీట్‌రూట్ ని ఎలా తీసుకున్నా మంచిదే. క్యారెట్, బీట్‌రూట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది.
విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు
విటమిన్ ఎ కణాల పెరుగుదల మరియు ఎముక మజ్జ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.ఇది ప్లేట్‌లెట్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. క్యారెట్లు, చిలగడదుంపలు మరియు ఆకు కూరలు వంటి ఆహారాలలో విటమిన్ ఎ లభిస్తుంది. గుమ్మడికాయలలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది ప్లేట్‌లెట్ల సరైన ఉత్పత్తికి అవసరం.
ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు
హిమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ అవసరం. ఐరన్ పరోక్షంగా ప్లేట్‌లెట్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఐరన్ ఎక్కువగా ఎర్ర మాంసం, చికెన్ , చేపలు, చిక్కుళ్ళ లో లభిస్తుంది . ఎండుద్రాక్ష, ఆప్రికాట్, ఎండు ఖర్జూరం లాంటి డ్రై ఫ్రూట్స్ లో కూడా లభిస్తుంది. ఒక గుప్పెడు ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టుకుని వాటిని ఉదయం తింటే రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుంది.
జింక్ అధికంగా ఉండే ఆహారాలు
కణ విభజన మరియు రోగనిరోధక పనితీరులో పాల్గొంటుంది .జింక్ కి మాంసం, షెల్ఫిష్, చిక్కుళ్ళు మంచి మూలాలు.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు
ప్లేట్‌లెట్స్‌తో సహా అన్ని రక్త కణాల ఉత్పత్తికి అవసరం.ప్రోటీన్ కి మాంసాలు, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు మంచి వనరులు.