Can diabetics eat Upma? Telugu
డయాబెటిస్ ఉంటే ఉప్మా తినొచ్చా? అనే సందేహం తరచూ వస్తుంటుంది.
ఉప్మాలో ఎక్కువగా పిండి పదార్థాలే ఉంటాయి. ఒక 100 గ్రాముల ఉప్మా లో దాదాపు 70 గ్రాములు కార్బొహైడ్రేట్స్ఉంటాయి.. ఏ ఆహారమైనా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 0 నుంచి 55 వరకు ఉంటే అది డయాబెటిస్ వారికి మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. 70 పైన ఉంటే మాత్రం డయాబెటిస్ ఉన్న వారికి ఆ ఆహారం కాస్త ప్రమాదకరం.
అయితే ఉప్మా రవ్వ గ్లైసెమిక్ ఇండెక్స్ 68గా ఉంటుంది. అంటే ఇది మరి మంచిది కాదు అలాగని మరి ప్రమాదం కాదు అందువల్ల డయాబెటిస్ ఉంటే అప్ప్పుడప్పుడు ఉప్మా తిన వచ్చు . ఉప్మాని మరింత ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చుకోవాలంటే దీనిలో కాస్త కూరగాయలు జోడించాలి. క్యారట్లు, టమాటాలు, క్యాప్సికం లాంటి వి . ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె వంటి వ నూనెలతో ఉప్మా చేసుకోవాలి . అలాగే నూనె తక్కువగా వాడడం మంచిది. రాగి ఉప్మా, ఓట్స్ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా (దొడ్డు రవ్వ) వంటివి బొంబాయి రవ్వ ఉప్మా కన్నా డయాబెటిస్ వారికి మంచి ఆహారం
Nutrient | Amount per Serving (1 cup ~ 200g) |
---|---|
Calories | 200-250 kcal |
Carbohydrates | 140-145 g |
Protein | 5-8 g |
Fat | 8-10 g |
Fiber | 3-4 g |
Sodium | 400-500 mg |
Potassium | 200-300 mg |
Calcium | 30-40 mg |
Iron | 1-2 mg |