Home Remedies for Low BP Telugu
లోబీపీని హైపోటెన్షన్ అని కూడా అంటారు. సాధారణంగా బీపీ లెవల్ 120/80 mm Hg ఉండాలి మహిళల్లో 60/90 mm Hg , మగవారిలో 70/100 mm Hg కంటే తక్కువగా ఉంటే దాన్ని లోబీపీ అంటారు.
లోబీపీ ఉంటే తల తిరగడం, కళ్లు మసకబారడం, తొందరగా అలసిపోవడం, వికారం, వాంతులు, తలనొప్పి , ఒళ్లు చల్లబడిపోవడం, ఎక్కువ సేపు పని చెయ్యలేకపోవటం, అప్పుడప్పుడు మూర్ఛ వంటి
లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు బీపీ మరీ పడిపోతే.. చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. డీ హైడ్రేషన్, గుండె జబ్బులు విటమిన్ బీ12 లోపం, అడ్రినలైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, ఇన్ఫెక్షన్స్ , హై బీపీ కోసం ఎక్కువ డోస్ లో మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, మాదక ద్రవ్యాలు వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది.
లోబీపీ లక్షణాలను గుర్తించి జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటే బీపీని సాధారణ స్థితి తీసుకురావచ్చు .
ఫోలేట్ పుష్కలంగా ఉండే ఆహారం
ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కానాల ఉత్పత్తి కి తోడ్పడతాయి .
ఆకు కూరలు , పప్పులు , చిక్‌పీస్, కిడ్నీ బీన్స్, నారింజ, బొప్పాయి, బీట్‌రూట్, వేరుశెనగ, బ్రోకలీ మరియు బెండ కాయ లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.
ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం.
ఐరన్ అధికంగా ఉండే ఆకు కూరలు , పప్పులు, చిక్‌పీస్, కిడ్నీ బీన్స్, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ , బెల్లం, గుమ్మడికాయ గింజలు ఉ కూడా ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. నాన్ వెజ్ తీసుకొనే వారు చికెన్, మటన్, ఫిష్ , లివర్ లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుందని తెలుసుకోండి
విటమిన్ బీ 12 అధికంగా ఉండే ఆహారం..
విటమిన్ బి-12 లోపం కారణంగా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా లోబీపీకి దారి తీస్తుంది. మీ డైట్‌లో విటమిన్ బి-12 అధికంగా ఉండే గుడ్లు, పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు మరియు చీజ్ వంటివి, బలవర్థకమైన తృణధాన్యాలు, బలవర్థకమైన సోయా ఉత్పత్తులు, పనీర్ తీసుకోవాలి . మాంసాహారం తింగలిగితే చేపలు , చికెన్, కాలేయం, , రొయ్యలు మరియు క్లామ్స్ B12 యొక్క అద్భుతమైన మూలాలు.
ఐరన్ అధికంగా ఉండే ఆకు కూరలు , పప్పులు, చిక్‌పీస్, కిడ్నీ బీన్స్, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ , బెల్లం, గుమ్మడికాయ గింజలు ఉ కూడా ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. నాన్ వెజ్ తీసుకొనే వారు చికెన్, మటన్, ఫిష్ , లివర్ లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుందని తెలుసుకోండి
లిక్విడ్ ఫుడ్ తీసుకోండి..
డీహైడ్రేషన్ కారణంగానూ లోబీపీ వస్తుంది . మీరు లోబీపీతో బాధపడుతుంటే.. రోజూ తగినంత నీరు తాగండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోండి.
ఉప్పు సరిపడా తీసుకోండి..
లోబీపీ ఉన్న వారు తీసుకునే ఆహారంలో ఉప్పు సరిపడా తీసుకోవాలి. అయితే ఉప్పు మరి ఎక్కువైనా ఇతర అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వ్యాయామం చేయాలి
దీర్ఘ కాలికంగా లో బీపీతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. నెమ్మదిగా నవడం, తేలికపాటి యోగా, ధ్యానం లాంటివి చేయాలి. భారీ బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటివి చేయకూడదు. నీరసంగా అనిపించినా, ఎక్కువ చెమటలు పట్టినా జాగ్రత్త పడాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలి.
ఎండకి తిరగవద్దు
లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. ముఖ్యంగా వేసవికాలంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడానికి ప్రయత్నించాలి.
స్లో పొజిషన్ మార్పులు
అకస్మాత్తుగా నిలబడడం చెయ్యకూడదు. ఆలా చేస్తే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది .మంచం మీద నుండి నెమ్మదిగా లేవాలి కుర్చీ నుంచి నిలబడేటప్పుడు కూడా నెమ్మదిగా లేవాలి
కంప్రెషన్ స్టాకింగ్స్
ఇవో రకమైన సాక్స్లు. పాదాలు, కాళ్ల రక్తనాళాలపై ఒత్తిడి తగ్గేలా చేసి రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేయడంలో కంప్రెషన్ స్టాకింగ్స్ సహాయపడతాయి.స్టాకింగ్స్ లో బీపీ లక్షణాలను తగ్గించొచ్చు. డాక్టర్ని సంప్రదించిన తరువాతే ఇవి వాడుకోవాలి
చిన్న చిన్న మోతాదులో భోజనం
ఒకే సారి ఎక్కువగా తినడం ద్వారా రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవచ్చు . అందుకే తరచుగా చిన్న చిన్న మోతాదులో భోజనం తినండి.
అంతేకాకుండా తగినంత నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి . అలాగే పడుకునేటప్పుడు మీ తల కింద ఎక్కువ పిల్లోలు పెట్టుకొనే పాడుకోవాలి . ఇలా తల కొద్దిగా పైకి లేపి నిద్రించడం వల్ల రక్త ప్రసరణపై గురుత్వాకర్షణ ప్రభావం తగ్గుతుంది. ఎక్కువసేపు నిలబడటం మానుకోండి.ఎక్కువసేపు నిలబడితే కాళ్లలో రక్తం చేరి, రక్తపోటు తగ్గుతుంది. మీ ఆహారంలో ప్రోటీన్లను ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. హెర్బల్ టీలుఎక్కువగా తీసుకోండి.
డయాబెటిస్ ఉంటే సుగర్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి . రక్తం తక్కువగా ఉంటే పెరగడానికి మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోండి . మరి సన్నంగా ఉంటే కొంచెం బరువు పెరగడానికి ప్రయత్నం చెయ్యండి