Is it safe to exercise if you have high blood pressure in Telugu?
వ్యాయామం చెయ్యడం మీ గుండె మరియు రక్త నాళాలు మంచి ఆకృతిలో ఉంచడం ద్వారా మీ రక్తపోటును తగ్గిస్తుంది. తద్వారా వచ్చే గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీ వైద్యుడు రక్తపోటుని తగ్గించడానికి వ్యాయామం సూచించవచ్చు. వ్యాయామం చెయ్యడం లెక్కలేనన్ని ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వ్యాయామం ఎముకలను బలపరుస్తుంది . ఇది మీ కండరాలు మరియు కీళ్లను చురుకుగా మరియు స్వతంత్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.. మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది
మీకు అధిక రక్తపోటు ఉంటే వ్యాయామం చేయడం సురక్షితమేనా అని చాల మంది అడుగుతారు
చాలా మందికి డాక్టర్స్ సురక్షితమే అని సమాధానం చెబుతారు. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీరు చాలా సురక్షితంగా వ్యాయామం చేయవచ్చు. కానీ మీరు ఏదైనా కొత్త వ్యాయామంను ప్రారంభించే ముందు మీ డాక్టర్ తో మాట్లాడటం ఎల్లప్పుడూ మంచిది.
శారీరక శ్రమ చేస్తున్న టైం లో మీ రక్తపోటు కొద్దిసేపు మాత్రమే పెరుగుతుంది. చాలా మందికి, దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు . మీరు శారీరక శ్రమను ఆపివేసినప్పుడు రక్తపోటు త్వరగా సాధారణ స్థితికి వస్తుంది.
మీ రక్తపోటు మరీ ఎక్కువగా ఉంటే, వ్యాయామం ప్రారంభించే ముందు మందులతో తగ్గించాలి
మీకు రక్తపోటుని 140/90mmHg నుండి 179/99 ఉంటే , మీకు ఈ ఇబ్బందులు లేక పొతే రక్తపోటుని తగ్గించడంలో సహాయపడటానికి వ్యాయామం చేయడం మంచిదే
180/100mmHg – 199/109 మ్హ్గ్ ఉంటే వ్యాయామం ప్రారంభించే ముందు మీ డాక్టర్ తో మాట్లాడండి.ఇలాంటి పరిస్థితులలో వ్యాయామం ప్రారంభించే ముందు రక్తపోటుని మందులతో తగ్గిస్తే మంచిది
200/110mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వ్యాయామంను ప్రారంభించవద్దు – వీలైనంత త్వరగా మీ డాక్టర్ ను సందర్శించండి
వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ మరియు గార్డెనింగ్, డిగ్గింగ్ వంటి ఏరోబిక్ కార్యకలాపాలు సురక్షితమైనవి.
వెయిట్ లిఫ్టింగ్, స్క్వాష్, స్కైడైవింగ్, స్ప్రింటింగ్, స్కూబా డైవింగ్ లాంటివి మీ డాక్టర్ని సంప్రదించిన తరువాతే మొదలుపెట్టాలి