Mediterranean diet Telugu
గ్రీస్, ఇటలీ, టర్కీతో సహా మెడిటరేనియన్ సముద్రం సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యూరోపియన్లలు తక్కువ జీవన ప్రమాణాలు కలిగి , సరైన వైద్య సదుపాయాలు లేనా ప్పటికీ, యూరప్‌లోని ఇతర ప్రాంతాల్లో నివసించే వారి కంటే ఎక్కువ ఆయుస్సు కలిగి ఉన్నారని కనుగొనబడింది. అలాగే వీరికి గుండె జబ్బులు కూడా తక్కువగా ఉండేవట . ఎందుకని ఆరాతీస్తే వారు తీసుకొనే ఆహారం మరియు పాటించే జీవన శైలే అని కనుగొన్నారు. వారు ఫాలో అయ్యే డైట్ కె మెడిటేరియన్ డైట్ అని పేరు పెట్టారు . వీరు డైట్లో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు,ప్రాసెస్ చెయ్యని తృణధాన్యాలు, గింజలు, నట్స్ వంటి మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువ గా తీసుకుంటారు.. ఆలివ్ నూనె ఎక్కువగా వాడతారు . చేపలు, చికెన్ , పాల ఉత్పత్తులు మితంగా మాత్రమే తీసు కుంటారు . రెడ్ మెట్ లాంటివి తినరు .వీరు స్వీట్స్ , కూల్ డ్రింక్స్ తీసుకోరు. వైన్ మాత్రం మితంగా తాగుతారు . exercise ఎక్కువగా చే స్తారు . మీకు interest ఉంటె గుండె ఆరోగ్యం కోసం మెడిటేరియన్ డైట్ ఫాలో అవ్వండి
Food Category | Examples | Recommended Frequency | Associated Benefits |
---|---|---|---|
కూరగాయలు | టమోటాలు, బచ్చలికూర, బ్రోకలీ, మిరియాలు | రోజు | విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటాయి |
పండ్లు | నారింజ, యాపిల్స్, ద్రాక్ష, బెర్రీలు | రోజు | అధిక ఫైబర్, విటమిన్లు మరియు సహజ చక్కెరలు |
హోల్ గ్రెయిన్స్ | హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ | రోజు | ఫైబర్ మరియు ఎనర్జీకి మంచి మూలం |
చిక్కుళ్ళు | కాయధాన్యాలు, చిక్పీస్, బీన్స్, బఠానీలు | వారానికి చాలా సార్లు | ప్రొటీన్లు, ఫైబర్ మరియు పోషకాలు అధికంగా ఉంటాయి |
గింజలు మరియు విత్తనాలు | బాదం, వాల్నట్లు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు | వారానికి చాలా సార్లు | ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. |
ఆలివ్ ఆయిల్ | ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ |