మలేరియా లక్షణాలు – symptoms of malaria
మలేరియా లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము
దోమకాటుకు గురైన ఏడు నుంచి 18 రోజుల మధ్య మలేరియా లక్షణాలు కనిపిస్తాయి.
మలేరియా వ్యాధిలో సాధారణంగా కనిపించే లక్షణం చలితో కూడిన అధిక జ్వరం.
తలనొప్పి కూడా చాలా సాధారణoగా కనిపించే లక్షణo . ఈ తలనొప్పి చాలా తీవ్రంగా ఉండి సాధారణ నొప్పి మాత్రలకు నయం కాదు. విపరీతమైన అలసట, బలహీనంగా అనిపించడం, కండరాల నొప్పి, ఛాతిలో నొప్పిగా ఉండటం కూడా జరగవచ్చు . , వాంతులు, కడుపు నొప్పి లాంటి జీర్ణ సమస్యలు , దగ్గు, ఆయాసం వంటి శ్వాస కోస లక్షణాలు మలేరియా లో కనిపిస్తాయి . ఆకలి తగ్గిపోతుంది. తద్వారా బరువు తగ్గడం జరుగుతుంది . మలేరియా సమస్య తీవ్రత పెరిగితే కాలేయం ఫై ప్రభావం పడి ఫలితంగా కామెర్లు రావచ్చు . మలేరియా పరాన్నజీవులు ఎర్రరక్త కణాలను నాశనం చేస్తాయి. తద్వారా రక్తహీనత సమస్య వస్తుంది. దీని వల్ల మైకం, శ్వాసలో ఇబ్బంది కలుగుతుంటాయి. ఒకవేళ మలేరియా మరి తీవ్ర రూపం దాల్చితే మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. దీని వల్ల మూర్ఛ , మనిషి కోమా లోకి కూడా వెళ్ళవచ్చు