The best home remedies for menstrual pain in Telugu

The best home remedies for menstrual pain in Telugu

కొంతమంది మహిళలు పీరియడ్ సమయంలో విపరీతమైన నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు. పీరియడ్ సమయం వారికి నరకం కింద లెక్కే . రక్తస్రావంకూడా ఎక్కువగానే ఉంటుంది. నొప్పి భరించలేక, ఏమీ తినలేక, నానాయాతన పడుతుంటారు. మరి కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే పీరియడ్కి ముందు కొన్ని చిట్కాలతో ఈ పెయిన్నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దామా.

 

అల్లం: పీరియడ్ క్రాంప్స్క అల్లం మంచిది . అల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఇబ్బందిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిలో అల్లం రసం, కొద్దిగా తేనె కలుపుకుని ఉదయాన్నే తాగండి
పసుపు: పసుపులో ఉండే కర్కుమిన్ అనే సహజ రసాయనం ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్కు 7 రోజుల ముందు , 3 రోజుల తర్వాత ఒక కర్కుమిన్ క్యాప్సూల్ను తీసుకోవడం మంచిదని ఒక అధ్యయనంలో తేలింది. మహిళల్లో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి కర్కుమిన్ సహాయపడుతుంది. ప గోరువెచ్చని నీటిలో లేదా పాలలో పసుపుని కొద్దిగా తేనె కలుపుకుని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు దీనిని త్రాగండి.దీనికి నల్ల మిరియాలు కూడా కలపి తాగవచ్చు
సోంపు: కాసిన్ని సోంపు గింజల్ని తిన్నా, లేదా వాటిని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగొచ్చు.
హెర్బల్ టీలు: చమోమిలే, పిప్పరమెంటు లేదా ఫెన్నెల్ వంటి టీలు సహజమైన యాంటిస్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
పీరియడ్ సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరం మాత్రమే తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరల తోపాటు ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే నట్స్, బీన్స్, గుమ్మడికాయ గింజలు, అవకాడోలు, డార్క్ చాక్లెట్ వంటివి ఎక్కువగా తినాలి. ఉప్పు, కారం, షుగర్, మద్యం, కార్బోనేటేడ్ డ్రింక్స్ , కాఫీలకు దూరంగా ఉంటే మంచిది.

ఉపశమనం
పొత్తికడుపుమీద వేడినీటితో లేదా హీటింగ్ ప్యాడ్తో కాపడం పెట్టుకుంటే కండరాలు వదులై నొప్పి తగ్గుతుంది. మసాజ్: లావెండర్ వంటి న నూనెలతో మీ పొత్తికడుపును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కూడా నొప్పిని తగ్గిస్తుంది. అలాగే కొన్ని రకాల యోగాసనాలను అలవాటు చేసుకుంటే ఫలితముంటుంది. చైల్డ్ పోజ్, క్యాట్- కౌ ,పిజెన్ పోజ్ మరియు లెగ్స్ అప్ ద వాల్ వంటి భంగిమలు ముఖ్యంగా తిమ్మిరిని తగ్గించడంలో మరియు దిగువ వీపు అసౌకర్యాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
విశ్రాంతి: మీ శరీరానికి నొప్పిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి పుష్కలంగా విశ్రాంతి మరియు నిద్ర ఉండేలా చూసుకోండి.
నెలసరి సమయంలో వచ్చే నొప్పి, అసౌకర్యాన్ని నివారించేందుకు మిఫ్తాల్ స్పాజ్ లాంటి సాధారణ పెయిన్ కిల్లర్స్ బాగా పనిచేస్తాయి.

Scroll to Top