Why Does Cardiac Arrest Happen in the Bathroom in Telugu
11 శాతం మంది బాత్‌రూమ్‌లోనే హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు
బాత్రూంలో కార్డియాక్ అరెస్ట్ ఎందుకు జరుగుతుంది అన్నది చూద్దాము
మీరు మలవిసర్జన చేస్తున్నప్పుడు లేదా urine కి పోతున్నప్పుడు మీరు గట్టిగా వత్తాల్సిన అవసరం పడొచ్చు. ఇలా చెయ్యడం మీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. మీ గుండె గట్టిదైనప్పుడు, ఏమి కాదు కానీ ఇప్పటికే అంతర్లీన గుండె జబ్బులు ఉన్న వ్యక్తులలో , ఇది హార్ట్ ఎటాక్‌కు దారి తీయవచ్చు
బాత్రూమ్‌కి వెళ్లడం వల్ల కొంతమందికి వాసోవగల్ రెస్పాన్స్ వస్తుంది .వాసోవగల్ రెస్పాన్స్ లో వాగస్ నాడిపై ఒత్తిడి పడుతుంది. వాసోవగల్ రెస్పాన్స్ లో గుండె వేగం స్లో అయ్యిపోయి కార్డియాక్ అరెస్ట్ రావచ్చు
చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండే నీటిలో స్నానం చేయడం రక్త ప్రసరణ వేగవంతమై గుండె మీద అధిక వత్తిడి పడుతుంది. దీని వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఆ సమయంలో రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది.
ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు స్నానం చేసేటప్పుడు ఇది జరిగే అవకాశం ఎక్కువ