What Is The Best Time To Eat Sprouts in Telugu

What Is The Best Time To Eat Sprouts in Telugu

ఈ మధ్యకాలంలో చాలామంది భోజనానికి బదులుగా మొలకెత్తిన విత్తనాలను తింటున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
మొలకలు విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్, ప్రోటీన్ తో సహా అవసరమైన పోషకాలకు పవర్ హౌస్. ఇవి తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు గణనీయంగా పెరుగుతాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి సరిగ్గా జరుగుతుంది. అయితే, వీటిని ఎప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి. వీటిని బ్రేక్‌ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం టైమ్‌లో తీసుకోవడం మంచిది. ఎందుకంటే, వీటిని తినడం వల్ల బాడీకి ఎనర్జీ అందుతుంది. ఈ టైం లో తినడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు.

రాత్రుళ్ళు డిన్నర్ టైమ్‌లో తీసుకోవడం మంచిది కాదు. రాత్రుళ్ళు తింటే జీర్ణ సమస్యలొస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ పట్టేసినట్లుగా ఉంటుంది. దీంతో మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది.

Scroll to Top